![]() |
![]() |

పాగల్ పవిత్ర జబర్దస్త్ కమెడియన్ గా అందరికీ తెలుసు. అలాంటి పవిత్ర రోడ్ యాక్సిడెంట్ నుంచి ప్రాణాలతో బయట పడింది. రీసెంట్ గా జరిగిన ఈ ప్రమాదం గురించి ఒక వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పెట్టింది.
"కార్ లో పిన్ని , ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓటు వేయడానికి మా ఊరు సోమశిల వెళ్తున్నాం.. ఎదురుగా వస్తున్న వాహనం కన్ఫ్యూజ్ అయ్యి ఒక్కసారిగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కార్ పక్కనే ఉన్న పంటపొల్లాల్లోకి వెళ్ళిపోయి మొత్తం నుజ్జునుజ్జయిపోయింది. కార్ లో ఉన్న బెలూన్స్ ఓపెన్ అవడంతో మాకు ఎలాంటి ఇబ్బంది కాలేదు. పది గంటల జర్నీలో ఇంకో పది నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాం అనగా ఈ ప్రమాదం జరిగింది. చావు అంచుల వరకు వెళ్లి వచ్చాము. నిజంగా ఆ దేవుడే మమ్మల్ని కాపాడాడు. ఎవరికీ ఏమీ కాలేదు. నేను, పిన్ని వాళ్ళ బాబు ఇద్దరం బెల్ట్ పెట్టుకుని నిద్రపోయాం. బెల్ట్ వేసుకోకపోతే ఎం జరిగేదో ఊహించుకోవడం చాలా కష్టం..ఒకవేళ ఎవరికన్నా ఏమన్నా ఐతే జీవితాంతం ఆ బాధను నేను అనుభవించాల్సి వచ్చేది. నిజంగా ఆ రోజు టైం చాలా బాగుందనే చెప్పాలి. అందరం బతికి బయటపడ్డాం. మా అమ్మ వచ్చి ఎర్ర నీళ్ల దిష్టి తీసింది. ఊర్లో అందరికీ తెలిసిపోయింది. సంఘటన స్థలానికి వచ్చి అందరూ చూస్తున్నారు, వీడియోస్ తీస్తున్నారు తప్ప ఎవరూ ఓదార్చడం లేదు. అదే నాకు చాలా బాధగా ఉంది. కార్ జర్నీ చాలా డేంజర్..ఎక్కడికైనా వెళ్ళాలి అంటే బస్సు లో ట్రైన్ లో వెళ్ళండి...ఒక్కో సారి మన తప్పు లేకపోయినా ప్రమాదం బారిన పడాల్సి వస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ సెకండ్ ఎపిసోడ్ షూట్ అయ్యాక డైరెక్ట్ గా ఊరికి బయల్దేరిపోయాను. ఎప్పుడూ ఇలా కాలేదు..కార్ ని షోరూమ్ కి పంపించాను..నాకేమన్నా అయ్యుంటే మా అమ్మ అస్సలు తట్టుకోలేకపోయేది" అని కన్నీటిపర్యంతమయ్యింది పవిత్ర.
![]() |
![]() |